
తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత బెనర్జీ ఆ పార్టీ శాసనసభ పక్ష నాయకురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం పార్టీ ఎమ్మెల్యేలతో మమత అధ్యక్షతన సమావేశం జరిగింది. మే 5న ఆమె ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మరుసటి రోజు మంత్రివర్గం ప్రమాణ స్వీకారం ఉంటుందని పార్టీ సీనియర్ నాయకుడు పార్థచటర్జీ తెలిపారు. నందిగ్రామ్ లో రీకౌంటింగ్ నిర్వహించాలని ఇప్పటికే ఆమె కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.