టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ మూడోసారి పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రిగా బుధవారం ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే కరోనా మహమ్మారిపై దృష్టి పెట్టారు. రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితి పై చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ప్రజలు మాస్క్ లు ధరించడం తప్పనిసరని, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో 50 శాతం హాజరు మాత్రమే ఉంటుందని చెప్పారు. షాపింగ్ కాంప్లెక్స్ లు, జిమ్ లు, సినిమా హాళ్లు, బ్యూటీ పార్లర్లు మూసి ఉంటాయన్నారు. సామాజిక, రాజకీయ సమావేశాలపై నిషేధం విధిస్తున్నట్లు పేర్కొన్నారు.