Mahesh Babu : సినిమా ఇండస్ట్రీలో ఎవ్వరు ఏ పొజిషన్ లో ఉంటారో చెప్పడం చాలా కష్టం… ఎందుకంటే ఒక్క సినిమాతో స్టార్ పొజిషన్ ని అందుకున్న హీరోలు ఉన్నారు. ఒక ప్లాప్ తో పాతాళానికి పడిపోయిన నటులు ఉన్నారు. కాబట్టి ఇండస్ట్రీలో ఎవరు శాశ్వతంగా ఉండరనేది వాస్తవం. ఇక ఏది ఏమైనా కూడా సూపర్ స్టార్ కృష్ణ నట వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న మహేష్ బాబు ‘రాజకుమారుడు’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాతో భారీ విజయాన్ని సాధించడమే కాకుండా తనకంటూ ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్నాడు. ఇక అప్పటి నుంచి వెను తిరిగి చూడకుండా వరుస సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తుండడం విశేషం…ఇక తనతో పాటు ఇండస్ట్రీకి వచ్చిన నటుడు సుమంత్…
నాగేశ్వరరావు మనవడిగా ఇండస్ట్రీలో తన కెరియర్ ను మొదలుపెట్టిన ఆయన మహేష్ బాబు రేంజ్ లోనే తను కూడా స్టార్ హీరోగా మారుతాడని అందరు అనుకున్నారు. కానీ కెరియర్ స్టార్టింగ్ లోనే అతనికి అనుకున్న విజయాలైతే దక్కలేదు. దాంతో కొంతవరకు డీలా పడిపోయాడు. ఇక తర్వాత కొన్ని సినిమాలు సక్సెస్ లను సాధించిన కూడా స్టార్ హీరో అయ్యే రేంజ్ లో సక్సెస్ లను సాధించలేకపోవడం వల్ల ఆయన చాలా వరకు వెనుకపడిపోయాడు.
స్క్రిప్ట్ సెలక్షన్లో ఆయన చేసిన మిస్టేక్స్ దానికి కారణమని చాలా మంది చెబుతుంటారు. ఆయన చేసిన సినిమాలతో కొంతవరకు తన కెరియర్ ను బిల్డ్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఆయన ఇప్పటికి సినిమాలను చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఈ మధ్యకాలంలో ఆయన చేసిన అనగనగా సినిమా సక్సెస్ సాధించింది.
ఓటిటి లో ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి విశేషమైన ఆదరణ రావడంతో మరోసారి సుమంత్ లైన్ లైట్ లోకి వచ్చాడు. ప్రస్తుతం ‘మహేంద్రగిరి వారాహి’ అనే సినిమాని కూడా చేస్తున్నాడు. ఈ సినిమా సూపర్ సక్సెస్ ని సాధిస్తే మరోసారి ఆయన పేరు మారుమ్రోగుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…