
మహారాష్ట్ర- తెలంగాణ అంతర్రాష్ట్ర రహదారిని తెలంగాణ పోలీసులు సోమవారం మూసివేశారు. కామారెడ్డి జిల్లా సలాబాత్ పూర్ వద్ద అంతర్రాష్ట్ర రహదారిపై చెక్ పోస్టు ఏర్పాటు చేసి వాహనాలు తెలంగాణలోకి రాకుండా పోలీసులు, రెవెన్యూ సిబ్బంది వెనక్కు పంపారు. మహారాష్ట్రలో కరోనా కేసులు తీవ్రంగా ఉండడంతో ఆ రాష్ట్రం నుంచి తెలంగాణలోకి ప్రవేశించే వాహనాలను నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.