spot_img
Homeక్రీడలుSanjiv Goenka controversy : లక్నో ఓనర్ సంజీవ్ అలాంటివాడు.. లలిత్ మోడీ సంచలనం

Sanjiv Goenka controversy : లక్నో ఓనర్ సంజీవ్ అలాంటివాడు.. లలిత్ మోడీ సంచలనం

Sanjiv Goenka controversy : ప్రస్తుతం ఐపీఎల్ రసవత్తరంగా సాగుతోంది. కొన్ని పిచ్ లపై పరుగుల ప్రవాహం అద్భుతంగా సాగుతుంటే.. కొన్ని పిచ్ ల పై వికెట్లు చూస్తుండగానే పడిపోతున్నాయి. అటు బ్యాటింగ్ వైపు.. ఇటు బౌలింగ్ వైపు ఐపీఎల్ నడుస్తోంది. ఎవరు గెలుస్తారు అనే విషయాన్ని ఏ విశ్లేషకుడు కూడా స్పష్టంగా చెప్పలేకపోతున్నారు.

ఐపీఎల్ అనేది పోటాపోటీగా సాగుతూ ఉంటుంది. ఇందులో ఆటగాళ్ల ప్రదర్శన నిమిషం నిమిషం మారిపోతూనే ఉంటుంది. అలాంటప్పుడు గెలుపు మీద ఏ జట్టుకైనా ఆశలుంటాయి. ఏ జట్టు కెప్టెన్ అయినా సరే తన బృందాన్ని గెలిపించాలని కోరుకుంటాడు. అయితే ఈ విషయం లక్నో యజమాని సంజీవ్ గోయంకా కు అర్థం కావడం లేదు. గతంలో కేఎల్ రాహుల్ ఉన్నప్పుడు హైదరాబాద్ చేతిలో ఓడిపోయినప్పుడు మైదానంలో అతడి మీద ఆగ్రహం వ్యక్తం చేశాడు. అతడిని బయటికి పంపించేసాడు. అతడి స్థానంలో రిషబ్ పంత్ ను తీసుకున్నాడు.. పంత్ నాయకత్వంలో లక్నో జట్టు గత ఏడాది చెప్పుకునే స్థాయిలో విజయాలు సాధించలేదు. ఈ ఏడాది కూడా అది స్థాయిలో ఆడుతోంది.. ఈ నేపథ్యంలో రిషబ్ పంత్ మీద విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇటీవల మ్యాచ్లో లక్నో జట్టు ఓడిపోవడంతో పంత్ మీద అందరూ చూస్తుండగానే ఆ గ్రహం వ్యక్తం చేశాడు సంజీవ్. ఐపీఎల్ లో లక్నో జట్టు భవితవ్యం ఇప్పటికే ముగియలేదు. ఇంకా చాలా మ్యాచులు ఆడాల్సి ఉంది. అయినప్పటికీ పంత్ అతడి మీద ఆగ్రహం వ్యక్తం చేయడం ఆందోళన కలిగిస్తోంది.

ఇదే విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తూ ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోడీ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మ్యాచ్ ఓడిపోయిన తర్వాత సంజీవ్ కెప్టెన్, టీం సభ్యులతో అలా వ్యవహరించడం సరికాదని మండిపడ్డాడు. ప్లేయర్లు.. అభిమానుల కోసమే ఐపీఎల్ లీగ్ ఏర్పడిందని.. ఇలాంటి ముక్కోపి యజమానుల కోసం తాను ఐపీఎల్ ఏర్పాటు చేయలేదని లలిత మోడీ అన్నారు. సంజీవ్ ఒక లూజర్ అని.. అతడు ఒక జోకర్ అంటూ మండిపడ్డారు. ఒకవేళ తను ఐపీఎల్ చైర్మన్గా ఉండి ఉంటే ఇప్పటికే సంజీవ్ ను బ్యాన్ చేసేవాడినని.. అతని యాజమాన్యాన్ని కూడా శాశ్వతంగా రద్దు చేసేవాడినని స్పష్టం చేశారు.

లలిత్ మోడీ వ్యాఖ్యలతో చాలామంది ఏకీభవిస్తున్నారు. సంజీవ్ అలా వ్యవహరించడం సరికాదని చెబుతున్నారు. ఐపీఎల్ లో అన్ని జట్లు గెలవాలని కోరుకుంటాయని.. కాకపోతే విజయాన్ని ఒక జట్టు మాత్రమే సాధిస్తుందని విషయాన్ని సంజీవ్ ఎందుకు గుర్తుంచుకోలేకపోతున్నారని అభిమానులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా సంజీవ్ తన వ్యవహార శైలి మార్చుకోవాలని సూచిస్తున్నారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular