నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా ఫీల్ గుడ్ సినిమాల దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందించిన సినిమా “లవ్ స్టోరి”. ఈ సినిమా సెప్టెంబర్ 24న థియేటర్ లలో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. తాజాగా “లవ్ స్టోరి” అన్ ప్లగ్ డ్ ఈవెంట్ ను హైదరాబాద్ లోని ఓ హోటళ్లో గ్రాండ్ గా నిర్వహించారు. మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ అతిథులుగా హాజరయ్యారు. చిరు, అమీర్ ఖాన్ “లవ్ స్టోరి” టీమ్ కు బెస్ట్ విశెస్ తెలిపారు. ఈ సందర్భంగాసంగీత దర్శకుడు పవన్ సీహెచ్ మాట్లాడుతూ…మా సినిమా కార్యక్రమానికి అమీర్ ఖాన్ గారు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. “లవ్ స్టోరి” పాటలు ఇంత పెద్ద విజయం సాధించాయంటే అందుకు కారణం దర్శకుడు శేఖర్ కమ్ముల గారు. నాపై నమ్మకం ఉంచినందుకు ఆయనకు థాంక్స్ అన్నారు.
మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ… కరోనా లాక్ డౌన్ తర్వాత పిల్లలు స్కూల్ కు వెళ్తే ఎంత సంతోషంగా ఉంటుందో, ఇప్పుడు ఇలా సినిమా ఫంక్షన్స్ కు రావడం అంతే సంతోషంగా ఉంది. సినిమా కార్యక్రమాల్లో మిత్రులను కలిసి, ప్రేక్షకుల చప్పట్లు విని చాలా రోజులు అవుతోంది. ఈ మధ్య నన్ను ఎవరైనా టీజర్, ట్రైలర్ లాంఛ్ చేయమని అడిగితే, ఇంట్లో కూర్చుని లాప్ టాప్ లో చేస్తూ ఉన్నాను. కానీ బయటకొచ్చి ఆడియెన్స్ చప్పట్లు వింటే వచ్చే సంతోషం వేరు. నారాయణదాస్ నారంగ్ గారు నాకు ఎన్నో ఏళ్లుగా మిత్రులు. ఆయన 80 వ దశకంలో డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిషన్ రంగంలోకి లోకి చ్చినప్పటి నుంచి నాకు సన్నిహిత సంబంధం ఉంది. ఆయన నాకు గురువులా భావిస్తాను. ఫిల్మ్ ఇండస్ట్రీకి భీష్మాచార్యులు వంటివారు. ఏషియన్ ఫిల్మ్స్ నిర్మాణ రంగంలోకి రావడం సంతోషకరం. మీలాంటి వాళ్లు ప్రొడక్షన్ లోకి రావాలి. సినిమాలు నిర్మించాలి. సినిమా విలువ మరింత పెంచాలి. మీకు మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నాను. నారాయణదాస్ గారి అబ్బాయి సునీల్ తండ్రిని మించిన తనయుడు. చాలా స్మార్ట్. వాళ్ల కృషి లేకుంటే పంపిణీ రంగంలో, ఎగ్జిబిషన్ సెక్టార్ లో ఇన్ని మల్టీప్లెక్స్ థియేటర్స్, ఇన్ని స్క్రీన్స్ అందుబాటులో ఉండేవి కావు. ఇవాళ భారతదేశంలోనే ఎక్కువగా మల్టీప్లెక్స్ థియేటర్స్ హైదరాబాద్ లో ఉన్నాయంటే కారణం సునీల్ నారంగ్ లాంటి వాళ్ల కృషి వల్లే. “లవ్ స్టోరి” టైటిల్ విన్నప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది.
ప్రేమ కథలు చూసి చాలా కాలం అవుతోంది. నా స్నేహితుడు నాగార్జున గారి అబ్బాయి నటించాడు. ఇందాక అమీర్ ఖాన్ నాతో నాగ చైతన్య గురించి చెప్పారు. లాల్ సింగ్ చద్దాలో నటించాడు. చాలా కంఫర్ట్ గా అనిపించింది, మంచి యాక్టర్ అని. ఆ మాట వింటే నాకూ సంతోషమేసింది. నాగ చైతన్య మంచి వ్యక్తి. సక్సెస్, ఫెయిల్యూర్స్ కు చాలా మంది ఎగిరిపడుతుంటారు. కానీ చైతూ ఎప్పుడూ ఒకేలా సంమయనంతో ఉంటాడు. నాగార్జున లాంటి కూల్ ఫాదర్ కు చైతూ లాంటి కూల్ సన్ ఉన్నాడు. ఇండస్ట్రీతో నాగ చైతన్య జర్నీ కూడా నిర్మాణాత్మకంగా సాగుతోంది. ఆయన సుదీర్ఘ కాలం ప్రయాణం చేసేందుకు ఇది బాగా ఉపయోగపడుతుంది అని చెప్పగలను. చైతూ మంచి కథలు ఎంచుకుంటాడు, సెలెక్టివ్ గా, కొత్తగా సినిమాలు చేస్తుంటాడు. “లవ్ స్టోరి” కూడా అలాగే ఉంటుందని ఆశిస్తున్నాను. ఆల్ ద బెస్ట్ చైతూ. నాగ చైతన్య, నా మిత్రుడు అమీర్ ఖాన్ కలిసి నటించిన సినిమా లాల్ సింగ్ చద్దా చూడాలని వేచి చూస్తున్నాను. నేనే ముంబై వచ్చి సినిమా చూస్తానని అమీర్ తో చెప్పాను. ఆయన లేదు నేనే వచ్చి ఇక్కడ హైదరాబాద్ లో మీకోసం ప్రొజక్షన్ వేయిస్తా అన్నారు. సారంగ దరియా సాంగ్ కోసమైనా “లవ్ స్టోరి” సినిమా రెండు మూడు సార్లు చూస్తాను. మొన్న కరోనా టైమ్ లో ఇండస్ట్రీలో కార్మికులు పనిలేక అల్లాడిపోయారు. వాళ్లకు మేమంతా కలిసి నిత్యావసర వస్తువులు అందించి, ఆదుకున్నాం. ఇదే కాదు ఏ విపత్తు వచ్చినా ముందుగా స్పందించేది సినిమా తారలు అని చెప్పేందుకు గర్వపడుతున్నాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమా పరిశ్రమను ఆదుకునేందుకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ముందుకు రావాలని వినమ్రంగా కోరుతున్నా. అన్నారు.
అమీర్ ఖాన్ మాట్లాడుతూ…నాగ చైతన్యను లాల్ సింగ్ చద్దా కోసం ఫస్ట్ టైమ్ కలిశాను. ఆయనతో పనిచేస్తుంటే, ఎప్పటి నుంచో పరిచయం ఉన్న వ్యక్తిలా అనిపించాడు. లవ్ స్టోరి సినిమా కార్యక్రమం కోసం ఇక్కడికి రావడం సంతోషంగా ఉంది. నేనూ మీలాగే లవ్ స్టోరి చిత్రాన్ని ఈ నెల 24న చూస్తాను. అదీ థియేటర్ లలోనే. మహారాష్ట్రలో థియేటర్స్ ఇంకా ఓపెన్ అవలేదు. కానీ ప్రత్యేకంగా స్క్రీనింగ్ వేసుకుని చూడాలని అనుకుంటున్నాను. మొత్తం టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్. శేఖర్ కమ్ముల మీద ఇక్కడికి వచ్చిన అతిథులు చూపిస్తున్న ప్రేమ నన్ను కదిలిస్తోంది. సాయి పల్లవి పాటలు కొన్ని యూట్యూబ్ లో చూశాను. కానీ ఆమె సినిమాలు నేను ఇంకా చూడలేదు. ఆమె సినిమా పాటలోని ఫస్ట్ క్లిప్ చూసినప్పుడు సాయి పల్లవికి ఫ్యాన్ అయ్యాను. లవ్ స్టోరి సినిమా సంగీత దర్శకుడు, ఎడిటర్, డీవోపీ అండ్ ఆల్ కాస్ట్ అండ్ క్రూకు ఆల్ ద బెస్ట్. అన్నారు.
మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ మాట్లాడుతూ…నాగ చైతన్య, సాయి పల్లవి జంట లవ్ స్టోరి చిత్రంలో బాగుంది. వాళ్లద్దరూ బాగా నటించాలని ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది. పాండమిక్ టైమ్ లో సినిమాలు రిలీజ్ చేసేందుకు చాలా మంది నిర్మాతలు భయపడతున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మెరుగుపడ్డాయి. థియేటర్ లోనే తమ సినిమాను విడుదల చేసేందుకు ముందుకొచ్చిన నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు, సునీల్ నారంగ్ గారికి అభినందనలు. సినిమా ఇండస్ట్రీ మీద ఆధారపడి ఎంతో మంది కార్మికులు జీవిస్తున్నారు. వాళ్లు బాగుండాలంటే సినిమా అన్ని సెక్టార్లలో పుంజుకోవాలి. లవ్ స్టోరి చిత్రంతో థియేటర్ లలో సినిమా చూసే ఉత్సాహం రావాలని కోరుకుంటున్నా. అన్నారు.
దర్శకుడు శేఖర్ కమ్ముల మాట్లాడుతూ….మా లవ్ స్టోరి ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి గారు రావడం ఎంతో సంతోషంగా ఉంది. ఆయన మా సినిమా గురించి చెప్పిన మాటలు మాకెంతో ఉత్సాహాన్ని ఇచ్చాయి. ఆయనకు మా టీమ్ తరుపున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము. ఇక అమీర్ ఖాన్ ను అభిమానించే వాళ్లలో నేనూ ఒకర్ని. ఆయన సినిమా ఖయామత్ తే ఖయామత్ తక్ చూసినప్పుడు లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న అమీర్ ఖాన్ ఇలా గన్ పట్టుకుని డిఫరెంట్ సినిమా ఎలా చేయగలిగాడు అని ఆశ్చర్యపోయాను. నేను డాలర్ డ్రీమ్స్ సినిమా చేసి, దానికి నేషనల్ అవార్డ్ పొందాను. ఆ తర్వాత దిల్ చాహతా హై రిలీజైంది. అక్కడా యువత డ్రీమ్స్ కనిపిస్తాయి. ఎక్కడో మా సినిమాలకు తెలియని కనెక్షన్ ఉంది అనిపించింది. సినిమా టీ సర్ఫరోష్ సినిమా దర్శకుడు నాకు తెలిసిన మిత్రుడే. ఆయన మీకు కథ చెప్పి ఒప్పించి సినిమా చేశాడు. నేనూ ఒకరోజు మీకు కథ చెబుతాననే నమ్మకం కలిగింది. త్రీ ఇడియట్స్ చూశాక, నేను రూపొందించిన హ్యాపీడేస్ కు రిలేటివ్ గా అనిపించింది.
నాగ చైతన్య మాట్లాడుతూ….మెగాస్టార్ చిరంజీవి గారికి నా కార్యక్రమానికి వచ్చినందుకు థాంక్స్. ఆయన సినిమాల్లో మెగాస్టార్, బయట మెగా హ్యూమన్ బీయింగ్. కరోనా పాండమిక్ టైమ్ లో ఎంతోమంది కార్మికులకు సాయం చేశారు. మీరు ఇండస్ట్రీకి ఇచ్చిన సపోర్ట్ ఇన్ స్పైరింగ్ గా ఉంది. లవ్ స్టోరి ట్రైలర్ చూసి అమీర్ ఖాన్ గారు మెసేజ్ చేశారు. సండే ఏంటి ప్రోగ్రాం అని ఆయన అడగగానే ఇలా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది అని చెప్పాను. నేను వస్తాను అన్నారు.
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: Love story unplugged event
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com