నాగచైతన్య-సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న మూవీ లవ్ స్టోరీ. ఈ సినిమా ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ట్రైలర్ లో నాగచైతన్య తెలంగాణ యువకుడిగా కనిపించాడు. డ్యాన్స్ నేపథ్యంలో చిత్ర కథ సాగనున్నట్లు తెలుస్తోంది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ నెల 24న థియేటర్లలో రిలీజ్ కానుంది.