
యువతులు, మహిళల భద్రత కోసం దిశ యాప్ తీసుకొచ్చామని దీనితో కలిగే మేలును ప్రతి ఇంటికీ తెలియజేయాల్సిన అవసరముందని ఏపీ సీఎం జగన్ అన్నారు. ఇటీవల ప్రకాశం బ్యారేజీ వద్ద జరిగిన ఘటన తన మనసును కలచివేసిందని చెప్పారు. దిశ యాప్ ను ఎంత ఎక్కువగా డౌన్ లోడ్ చేయించగలిగితే అంతగా అక్క చెల్లెమ్మలకు అది తోడుగా నిలుస్తుందన్నారు. ఈ యాప్ దేశవ్యాప్తంగా 4 అవార్డులు సాధించిందని చెప్పారు.