
బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. కరోనా సమయంలో ఆర్థిక రంగానికి ఊతమిచ్చేలా బీజేపీ ప్రభుత్వం 20 లక్షల కోట్ల రూపాయాలతో ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించిందని తెలిపారు. ఆత్మనిర్భర భారత్ ప్రతిఫలంగా గతంలో ఎన్నడూ లేనంతగా 80 బిలియన్ డాలర్లకు పైగా విదేశీ పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. వైద్యరంగానికి కేటాయింపులు పెంచి, ప్రజా సంక్షేమానికి పెట్ట పీట వేస్తున్నమని తెలిపారు.