రాష్ట్రంలో కొనసాగుతున్న లాక్ డౌన్ మరింత పటిష్టంగా అమలు చేయాలని డీజీపీ మహేందర్ రెడ్డి పోలీసులను ఆదేశించారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో లాక్ డౌన్ అమలు తీరును శుక్రవారం ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఎల్బీనగర్, వనస్థిలిపురం, హయత్ నగర్ లో రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తో కలిసి డీజీపీ పర్యటించారు. చెక్ పోస్టులను పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వచ్చే ప్రజలను ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పారు.