
మహారాష్ట్రలో తగ్గినట్టే తగ్గిన కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మరో రెండు వారాలపాటు పూర్తిస్థాయి లాక్ డౌన్ పొడిగించే అవకాశం కనిపిస్తోంది. లాక్ డౌన్ ను మరో రెండు వారాలు అములు చేయాలని డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో సీఎం ఉద్దవ్ ఠాక్రే ఇవాళ మంత్రి మండలి సమావేశం జరుగనుంది. ఈ సందర్భంగా రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, లాక్ డౌన్ పొడిగింపు అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు.