Homeజాతీయం - అంతర్జాతీయంఒడిశా.. జూన్ 1 వరకూ లాక్ డౌన్ పొడిగింపు

ఒడిశా.. జూన్ 1 వరకూ లాక్ డౌన్ పొడిగింపు

కోవిడ్ వ్యాప్తిని నిరోధించేందుకు రాష్ట్రంలో అమలు చేస్తున్న లాక్ డౌన్ ను మరో రెండు వారాలు పొడిగిస్తున్నట్లు ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రకటించారు.  ఒడిశాలో మే 19వ తేదీ ఉదయం 5 గంటల నుంచి జూన్ 1వ తేదీ వరకూ ఈ లాక్ డౌన్ కొనసాగుతుందని ఆ ప్రభుత్వం తెలిపింది. వారాంతంలో పూర్తి లాక్ డౌన్ ఉంటుందని ప్రతి శుక్రవారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభమై సోమవారం తెల్లవారుజూమున 5 గంటల వరకూ పూర్తి లాక్ డౌన్ అమలులో ఉంటుందని ఒక ప్రకటనలో పేర్కొంది. ఒడిశా ప్రభుత్వం ఈనెల 5న ప్రకటించిన రెండు వారాల లాక్ డౌన్ ఈ నెల 19వ తేదీతో ముగియనున్నందున లాక్ డౌన్ పొడిగింపు నిర్ణయం తీసుకుంది.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular