Kashmir: ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్న ప్రభుత్వ ఉద్యోగులపై జమ్మూకశ్మీర్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ముగ్గురు ఉద్యోగులకు లష్కరే తయ్యిబా, హిజ్బుల్ ముజాహిద్దీన్ సంస్థలతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. వారిని ఉద్యోగాల నుంచి తొలగిస్తూ లెప్టినెంట్ గవర్నర్ మనోజ్ ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో ఓ పోలీస్ కానిస్టేబుల్ మాలిక్ ఇష్పాక్ నసీర్, స్కూల్ టీచర్ అజాజ్ అహ్మద్, ప్రబుత్వ వైద్య కళాశాలలో జూనియర్ అసిస్టెంట్ వసీం అహ్మద్ ఖాన్ ఉన్నారు.