Homeజాతీయం - అంతర్జాతీయంసెల్ఫీ తీసుకుంటుండగా పిడుగు.. 11 మంది మృతి

సెల్ఫీ తీసుకుంటుండగా పిడుగు.. 11 మంది మృతి

రాజస్థాన్ రాజధాని జైపూర్ లో విషాదం నెలకొంది. అమేర్ ప్యాలెస్ వద్ద ఉన్న వాచ్ టవర్ కు నిన్న పర్యాటకులు పోటెత్తారు. ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో వాచ్ టవర్ వద్ద భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలో ఆ టవర్ వద్ద సెల్పీలు తీసుకునేందుకు పర్యాటకులు ఎగబడ్డారు. ఆ సమయంలోనే భారీ పిడుగు పడింది. దీంతో అక్కడికక్కడే 11 మంది మరణించారు. మరో 35 మందికి తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులు పక్కనున్న లోయలో పడిపోయారు. వారందరినీ రెస్క్యూటీం బయటకు తీసుకొచ్చి సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై రాజస్థాన్ సీఎం ఆశోక్ గెహ్లాట్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular