
రాష్ట్రంలో కొన్ని చోట్ల రాగల రెండు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర, దక్షిణ, మధ్య తెలంగాణ జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కీలో మీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షాలు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఉత్తర కర్ణాటక పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, ఉత్తర కర్ణాటక నుంచి ఉత్తర కేరళ సముద్ర మట్టం వరకు ఏర్పడిన ఉపరిత ద్రోణి స్థిరంగా కొనసాగుతున్నట్లు వెల్లడించింది.