
మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి యాప నారాయణ అలియాస్ హరిభూషణ్ (50) కరోనాతో బాధపడుతూ మృతి చెందినట్లుగా గత నాలుగు రోజుల నుంచి వస్తున్న వార్తలపై ఆ పార్టీ స్పందించింది. హరిభూషణ్ మృతిని నిర్ధారిస్తూ ఆ పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో సోషల్ మీడియాలో లేఖ విడుదలైంది. తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి హరిభూషణ్, దండకారణ్యం మాడ్ డివిజన్- ఇంద్రావతి ఏరియా కమిటీ సభ్యురాలు సిద్దబోయిన సారక్క అలియాస్ భారతక్క కరోనా లక్షణాలతో బాధపడుతూ మృతి చెందినట్లు లేఖలో పేర్కొన్నారు.