
ఉత్తరాఖండ్ లోని హల్ద్వినిలో డీఆర్డీవో 500 పడకల కోవిడ్ హాస్పటల్ ను ఏర్పాటు చేసింది. ఇవాళ ఆ రాష్ట్ర సీఎం తీరత్ సింగ్ రావత్ ఆ హాస్పిటల్ ను వర్చువల్ గా ఫ్రారంభించారు. ఆ హాస్పిటల్ లో 375 ఆక్సిజన్ బెడ్లు, వెంటిలేటర్లతో కలిపి 125 ఐసీయూ బెడ్స్ ఉన్నాయి. రేపటి నుంచి పూర్తి స్థాయిలో హాస్పటల్ అందుబాటులో ఉంటుందని డీఆర్ డీవో అధికారులు చెప్పారు. కొవిడ్ కేర్ సెంటర్ ను మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ చంద్ర జోషి పేరును పెట్టినట్లు డీఆర్టీవో అధికారులు తెలిపారు.