
సాంఘిక సంక్షేమ ఇంటర్ కాలేజీలు ప్రవేశ పరీక్ష రద్దు అయింది. కరోనా ఉధృతి నేపథ్యంలో టీఎస్ ఆర్జేసీ సెట్ ను రద్దు చేస్తున్నట్లు ఎస్సీ, ఎస్టీ గురుకులాల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రకటించారు. పదో తరగతి గ్రేడ్ల ఆధారంగా ఇంటర్ లో ప్రవేశాలు చేపడుతామని తెలిపారు. ఈనెల 7వ తేదీ లోపు మార్కులు అప్ లోడ్ చేయాలని సూచించారు. www. tswreis.in వెబ్ సైట్ లో పూర్తి వివరాలు పొందుపరిచినట్లు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.