
ఇప్పటి వరకు చిన్నారులకు కరోనా పెద్ద ఎత్తున సోకిన దాఖలాలు లేవు. అసలు పిల్లలకు రాదనే అన్నారు మొదట్లో. కానీ ఇప్పుడిప్పుడే అమెరికాలో కొత్తరకం లక్షణాలతో పిల్లలకు కరోనా వస్తున్నదని బయటపడుతుంది. థర్డ్ వేవ్ లో కరోనా చిన్నారులపై పంజా విసురుతుందని వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో చిన్నారులకు టీకా అందించే అంశంపై కేంద్రం కసరత్తు చేస్తుంది. ఈ మేరకు భారత్ బయోటెక్ తయారు చేసిన కొవాగ్జిన్ ను రెండేళ్ల నుంచి 18 ఏళ్ల వయసు వారిపై పరీక్షించనున్నారు.