
దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్ చెన్నైలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో గురువారం కోవిడ్ వ్యాక్సిన్ రెండో డోసు తీసుకున్నారు. తన తండ్రి వ్యాక్సిన్ తీసుకుంటున్న ఫోటోను రజినీకాంత్ కుమార్తె సౌందర్య రజనీకాంత్ ట్విట్టర్ షేర్ చేశారు. రజినీకాంత్ తన తాజా చిత్రం అణ్నాత్తే కోసం హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో నెలరోజుల పాటు సుధీర్ఘ షూటింగ్ పూర్తి చేసుకుని బుధవారం నాడే చెన్నై చేరుకున్నారు. ఈ ఏడాది ద్వితీయార్థంలో ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది.