
కరోనా రకాల్లో అత్యంత ఆందోళనకరంగా మారిన డెల్టా వేరియంట్ ఆట కట్టించడంలో భారత్ కు చెందిన కొవాగ్జిన్ టీకా సమర్థంగా పనిచేస్తోందని అమెరికా ఆరోగ్య సంస్థ ( ఎన్ఐహెచ్) తెలిపింది. ఈ టీకా తీసుకున్న వారి సీరమ్ లపై రెండు అధ్యయనాలు జరపగా ఆల్పా, డెల్టా వేరియంట్లను కొవాగ్జిన్ సమర్థంగా తటస్థీకరిస్తున్నట్లు తేలిందని ఎన్ఐహెచ్ పేర్కొంది. భారత్ వైద్య పరిశోధన మండలి సహకారంతో ఫార్మా సంస్థ భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ ఆల్ఫా, డెల్టా వేరియంట్లపై సమర్థంగా పనిచేస్తోంది.