Kommineni Srinivasa Rao: హైదరాబాద్ లో కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్ట్ చేశారు. ఏపీ పోలీసులు జర్నలిస్టు కాలనీలోని ఆయన ఇంటికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యల ఘటనకు సంబంధించిన గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీసు స్టేషన్ లో ఇటీవల ఆయనపై కేసు నమోదైంది. రాజధాని రైతులు, మహిళల ఫిర్యాదుతో ఈ కేసు నమోదు చేశారు.