Homeక్రీడలుక్రికెట్‌Kolkata Knight Riders IPL 2026: కోల్ "కథ" మారాలంటే.. అది కచ్చితంగా జరగాలి

Kolkata Knight Riders IPL 2026: కోల్ “కథ” మారాలంటే.. అది కచ్చితంగా జరగాలి

Kolkata Knight Riders IPL 2026: 2024 ఐపీఎల్ లో వరుస విజయాలు సాధించి.. ఛాంపియన్ గా అవతరించింది కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు. గత ఏడాది మాత్రం దారుణమైన ఆట తీరు ప్రదర్శించింది. భీకరమైన ప్లేయర్ లు ఉన్నప్పటికీ.. కీలకమైన దశలో ఒత్తిడికి గురైంది. ఫలితంగా డిపెండింగ్ ఛాంపియన్ హోదాను నిలబెట్టుకోలేకపోయింది. ఈ సీజన్లో కొంతమంది ఆటగాళ్లను కొనుగోలు చేసిన ఆ జట్టు.. అంతగా ఆకట్టుకోలేకపోతోంది.

కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు
కు ప్రస్తుత ఐపిఎల్ లో వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి.. జట్టు ఆటగాళ్లు ఏమాత్రం ఆకట్టుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం పంజాబ్ జట్టుతో జరిగే మ్యాచ్ కోల్ కతా నైట్ రైడర్స్ కు అత్యంత ముఖ్యంగా మారింది. వచ్చే నాలుగు రోజుల్లో సొంత గడ్డమీద కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు రెండు మ్యాచ్లు ఆడాల్సి ఉంది.. పంజాబ్ జట్టుతో సోమవారం జరిగే మ్యాచ్ ద్వారా తాము పునరాగమనం చేయాలని కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు ప్లేయర్లు భావిస్తున్నారు..

సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో ఇటీవల కోల్ కతా ఓటమిపాలైంది. ఈ ఓటమి తర్వాత కెప్టెన్ రహానే డ్రెస్సింగ్ రూమ్ లో ఉద్వేగంగా మాట్లాడాడు.. రహానే మాట్లాడిన మాటలు జట్టు ఆటగాళ్లలో స్ఫూర్తినింపినప్పటికీ.. అతని బ్యాటింగ్ ఆందోళన కలిగిస్తోంది. 2023 ఐపీఎల్ తర్వాత పవర్ ప్లే నుంచి మిడిల్ ఓవర్లకు వెళ్లేసరికి అతడి స్ట్రైక్ రేట్ లో తగ్గుదల కనిపిస్తోంది. ఇది మాత్రమే కాదు.. కోల్ కతా జట్టుకు అనేక సమస్యలు ఉన్నాయి. బలహీనమైన పేస్ బౌలింగ్.. అస్థిరమైన మిడిల్ ఆర్డర్.. ధారాళంగా పరుగులు ఇస్తున్న వరుణ్ చక్రవర్తి.. ఇన్ని కారణాలు కోల్ కతా జట్టుకు ప్రతి బంధకాలుగా నిలుస్తున్నాయి.

2023 నుంచి కోల్ కతా జట్టుకు పంజాబ్ కింగ్స్ మీద సరైన రికార్డు లేకుండా పోయింది. ఐదు మ్యాచ్లు ఆడితే.. కేవలం ఒకదాంట్లో మాత్రమే విజయం సాధించింది..

పంజాబ్ జట్టు ప్రస్తుత ఐపీఎల్ లో ఉత్సాహంగా కనిపిస్తోంది. ఆడిన రెండు మ్యాచ్లలో విజయం సాధించింది. ఆ జట్టు ప్లేయర్లు పూర్తిస్థాయిలో ఆకట్టుకోలేకపోయిన.. సమర్థవంతంగా ఆట తీరు ప్రదర్శించారు. ఓపెనింగ్ బౌలర్లు పవర్ ప్లే లో పెద్దగా ప్రభావం చూపించలేకపోయారు. పంజాబ్ జట్టు కీలక బౌలర్ అర్ష్ దీప్ సింగ్ ఇంతవరకు వికెట్లు తీయలేదు. వైశాక్, చాహల్ మాత్రం కట్టుదిట్టంగా బంతులు వేస్తున్నారు. అయ్యర్ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. ఆర్య, సిమ్రాన్ సింగ్ దూకుడుగా ఆడుతున్నారు. కనోలి సూపర్ బ్యాటింగ్ తో ఆకట్టుకుంటున్నాడు.

 

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version