Klin Kaara: రామ్ చరణ్ సతీమణి ఉపాసన తాజాగా ఒక ఆసక్తికర పోస్ట్ షేర్ చేశారు. హైదరాబాద్ లోని నెహ్రూ జూలాజికల్ పార్క్ బృందానికి ఆమె ధన్యవాదాలు చెప్పారు. జూలోని ఒక ఆడపులికి తమ కుమార్తె క్లీంకార పేరు పెట్టినట్లు ఆమె తెలిపారు. ఒక ఏడాది క్రితం అది కేవలం ఒక చిన్న పులి పిల్ల. కానీ, ఈరోజు అదొక ఉల్లాసభరితమైన ఆడపులి. దానికి మా కుమార్తె క్లీంకార పేరునే పెట్టడం ఎంత ఆనందంగా ఉంది. ఈ విధంగా ప్రేమాభిమానాలు చూపించిన హైదరాబాద్ జూ బృందానికి ధన్యవాదాలు తెలిపింది.
ఆడపులికి క్లీంకార పేరు.. హైదరాబాద్ జూకు థాంక్స్ చెప్పిన ఉపాసన
హైదరాబాద్ జూ పార్క్ లో తన గారాల పట్టి క్లింకారాతో కలిసి ఆనందంగా గడిపిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన ఉపాసన.
జూలోని తెల్ల ఆడపులికి తమ కుమార్తె క్లీంకార పేరు పెట్టినట్లు తెలిపిన ఉపాసన. pic.twitter.com/oY0GKKboLU— ChotaNews App (@ChotaNewsApp) June 20, 2025