Kolkata Knight Riders : ఓటమి అనేది శాశ్వతం కాదు. గెలుపు అనేది పర్మనెంట్ అడ్రస్ కాదు. కొన్ని సందర్భాలలో మనం చేసే పనిలో పరాభవం ఎదురు కావచ్చు. అయినప్పటికీ చేసే పని విషయంలో ఏమాత్రం వెనకడుగు వేయకూడదు. మన కష్టంలో నిజాయితీ ఉన్నప్పుడు ఏదో ఒక సందర్భంలో గెలుపు లభిస్తూనే ఉంటుంది. ఐపీఎల్ లో కోల్ కతా ఓటమి తర్వాత ప్లేయర్లను ఉద్దేశించి కోచ్ చెప్పిన మాటలు ఇవి.
ఆటగాళ్లలో స్ఫూర్తిని నింపుతూనే.. జట్టు కోచ్ 2012 నాటి సంగతిని బయటపెట్టారు. అది కాస్త ఇప్పుడు సంచలనంగా మారింది. 2012లో కోల్ కతా జట్టుకు గౌతం గంభీర్ నాయకత్వం వహించాడు. నాటి సీజన్లో మొదటి రెండు మ్యాచ్లను కోల్ కతా నైట్ రైడర్స్ కోల్పోయింది. దీంతో ఆ జట్టు మీద అంచనాలు లేకుండా పోయాయి. అప్పట్లో చెన్నై, ముంబై జట్లు భీకరంగా ఆడేవి. దీంతో అందరూ ఈసారి కూడా చెన్నై లేదా ముంబై ఛాంపియన్ అవుతుందని అనుకున్నారు. రెండు మ్యాచ్లలో ఓడిపోయిన కోల్ కతా జట్టు.. తర్వాత బౌన్స్ బ్యాక్ అన్నట్టుగా రెచ్చిపోయింది. సూపర్ ఆట తీరుతో వరుస విజయాలు సాధించింది. ఏకంగా చాంపియన్ అయింది.
2012లో విజేతగా నిలిచిన తర్వాత కోల్ కతా జట్టు రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ఆ జట్టు విలువ విపరీతంగా పెరిగింది. 2012 తర్వాత మళ్లీ 2024లో కోల్ కతా జట్టు విజేతగా నిలిచింది. ఫైనల్ లో హైదరాబాద్ జట్టును ఓడించింది. 2024లో కోల్ కతా జట్టుకు మెంటర్ గా గౌతమ్ గంభీర్ వ్యవహరించాడు. నాడు అతడు చూపించిన తెగువను గమనించిన బీసీసీఐ అప్పటి అధ్యక్షుడు జై షా టీమ్ ఇండియా కోచ్ పదవి ఆఫర్ చేశాడు. మొదట్లో కాదు కూడదు అన్నప్పటికీ.. ఆ తర్వాత గౌతమ్ గంభీర్ మెత్తబడ్డాడు. టీమిండియా కోచ్ అయ్యాడు.
ఇప్పుడు కూడా అజింక్య రహనే నాయకత్వంలో కోల్ కతా జట్టు తొలి రెండు మ్యాచ్లు ఓడిపోయింది. మొదటి మ్యాచ్ ముంబై చేతిలో.. రెండవ మ్యాచ్ హైదరాబాద్ చేతిలో ఓటమిపాలైంది. జట్టులో అద్భుతమైన ప్లేయర్లను నేపథ్యంలో కోల్ కతా త్వరగానే పుంజుకుంటుందని.. వరుస విజయాలు సాధించి 2012 మాదిరిగానే ట్రోఫీ అందుకుంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. రహానే కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాడు. అదే జరిగితే కోల్ కతా జట్టు ఐపిఎల్ చరిత్రలో సరికొత్త బెంచ్ మార్క్ సృష్టించినట్టే.
