కేజీ నుంచి పీజీ వరకు అంత ఆన్ లైన్ క్లాసులేనని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన సెట్స్ పరీక్షలు యథాతథంగా సాగుతాయన్నారు. టీ శాట్, దూరదర్శన్ ద్వారా పాఠ్యాంశాల బోధన ఉంటుందన్నారు. రికార్ట్ లెసన్స్ అన్నీ టీ శాట్ యాప్స్ లో అందుబాటులో ఉంటాయన్నారు. 46 జీవో యథాతధంగా అమలవుతందన్నారు. ఈ ఏడాది కూడా ట్యూషన్ ఫీజులు మాత్రమే వసూలు చేయాలన్నారు.