
ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కొవిడ్ రోగులకు అందుతున్నచికిత్స పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. సామాజిక కార్యకర్త తోట సురేష్, ఏపీ సివిల్ లిబర్టీస్ అసోసియేషన్ వేసిన పిటిషన్లపై ఏపీ హైకోర్టులో సుదీర్ఘంగా విచారణ జరిపారు. ఆస్పత్రుల్లో అందుతున్న చికిత్స, ఫిీజులు వసూలు, ఇతర అంశాలపై వెంటనే ఫ్లయింగ్ స్క్వాడ్స్ ను ఏర్పాటు చేయాలని హైకోర్టు సూచించింది.