spot_img
Homeక్రైమ్‌Ketan Agarwal case : కేతన్ అగర్వాల్ ఇంట్లో మరో ఘోరం.. విధి ఇలా పగబట్టిందేంటి..

Ketan Agarwal case : కేతన్ అగర్వాల్ ఇంట్లో మరో ఘోరం.. విధి ఇలా పగబట్టిందేంటి..

Ketan Agarwal case : నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు. పెళ్లి కోసం భారీగా ఏర్పాట్లు చేసుకున్నాడు. దానికోసం భారీగా ఖర్చు పెట్టాడు. ఏకంగా 17 కోట్లు పెట్టి రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయపూర్ ప్రాంతంలో ఒక అత్యంత విలాసవంతమైన హోటల్ బుక్ చేసుకున్నాడు. తన పెళ్లికి వచ్చే అతిధులను తీసుకురావడానికి హెలికాప్టర్లను బాడుగకు మాట్లాడుకున్నాడు.. అప్పట్లో ఎంగేజ్మెంట్ కూడా చాలా గట్టిగా చేసుకున్నాడు. బిజినెస్ సర్కిల్స్ మొత్తం తన గురించి మాట్లాడుకునేలాగా చేశాడు.

చిన్న వయసులోనే స్థిరాస్తి వ్యాపారం లోకి వచ్చి భారీగా సంపాదించాడు. తన జీవితంలోకి వచ్చే అమ్మాయి గురించి గొప్ప గొప్ప కలలు కన్నాడు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. ఆ తర్వాత అతడి జీవితం మరో విధంగా మారింది. విధి పగబట్టింది. కాబోయే భార్య అతడిని చంపేసింది. పైగా ఆమెకు మరొక వ్యక్తితో సంబంధం ఉంది. తన ప్రేమికుడితో కలిసి తనకు కాబోయే భార్య తనను చంపేస్తుందని అతడు ఊహించలేదు. రెండుసార్లు తనను చంపే ప్రయత్నం విఫలమైందని అతడు చనిపోయిన తర్వాత తెలుసుకున్నాడు. అయినప్పటికీ జరగాల్సిన ఘోరం జరిగిపోయింది.

ఇదంతా కూడా ఇటీవల కాలంలో మనం చూస్తున్న.. చదువుతున్న కేతన్ అనే స్థిరాస్తి వ్యాపారికి సంబంధించిన దీనగాధ. అతడు పోయిన బాధ నుంచి ఇంకా కుటుంబం తేరుకోలేదు. ఆ కేసు ఇంకా విచారణ దశలో ఉంది. రకరకాల మలుపులు తిరుగుతోంది. అతడు చనిపోయిన విషాదం గుండెను మెలి తిప్పుతుండగానే.. కేతన్ కుటుంబంలో మరో విషాదం చోటు చేసుకుంది.

కేతన్ తాత దేవిచంద్ అగర్వాల్ అనారోగ్యంతో కన్నుమూశారు. కేతన్ చనిపోయిన దగ్గరనుంచి ఆయన ఆరోగ్య పరిస్థితి దారుణంగా మారిపోయింది. శనివారం రాత్రి అతనికి గుండెపోటు రావడంతో చనిపోయారు.. దీంతో కేతన్ కుటుంబం మరింత విషాదంలో కూరుకుపోయింది. కొడుకు మరణం.. తండ్రి మరణం.. ఇవన్నీ కూడా కేతన్ అగర్వాల్ తండ్రికి నరకం చూపిస్తున్నాయి. ఆయన విలపిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టిస్తోంది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular