సీబీఎస్ఈ పరీక్షలు రద్దు చేయాలని కేజ్రీవాల్ విజ్ఞప్తి
సీబీఎస్ఈ 12 వ తరగతి పరీక్షలు రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్లు దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. గత పనితీరు ఆధారంగా విద్యార్థులను ఎవాల్యూయేట్ చేయాలని కోరినట్లు తెలిపారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు 12వ తరగతి పరీక్షల గురించి తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. వ్యాక్సినేషన్ లేకుండా పరీక్షలు నిర్వహించరాదని వారు కోరుకుంటున్నారని తెలిపారు.