
ఉత్తర భారతంలోని ప్రముఖ శైవ క్షేత్రమైన కేదార్ నాథ్ ఆలయం తలుపులు సోమవారం ఉదయం తెరుచుకున్నాయి. గతేడాది నవంబర్ 16న ఆలయాన్ని మూసివేసిన విషయం తెలిసిందే. ఈ నెల 14న స్వామివారి విగ్రహాన్ని ఉఖిమత్ ఓంకారేశ్వర్ నుంచి ఆలయానికి తీసుకువచ్చారు. రుద్రప్రయాగ్ లోని ఆలయ పున ప్రారంభం సందర్భంగా సుమారు 11 క్వింటాళ్ల పూలతో సుందరంగా అలంకరించారు. ఇదిలా ఉండగా ఇప్పటికే గంగ్రోత్రి, యమునోత్రి ఆలయాలు ఈ నెల 14న తెరుచుకోగా పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.