
దేశవ్యాప్తంగా ఆస్పత్రుల్లో అగ్నిప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ రాష్ట్ర వైద్యారోగ్యశాఖకు కీలక ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు ఆస్పత్రుల్లో జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. అగ్నిప్రమాదాలు జరగకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. గాంధీ టిమ్స్ వంటి చోట్ల అగ్నిమాపక యంత్రాలు సిద్ధంగా ఉంచాలని ఆయన ఆదేశించారు.