
దేశంలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండడం ఆందోళనకు గురి చేస్తున్నది. సెకండ్ వేవ్ లో మహమ్మారి రెట్టింపు వేగంతో విస్తరిస్తుండడంతో ప్రపంచ రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. వరుసగా మూడో రోజు శనివారం మూడు లక్షలకు పైగా కేసులు వెలుగు చూశాయి. దీంతో మూడు రోజుల్లోనే దాదాపు పది లక్షల వరకు కరోనా కేసులు నమోదు అయ్యాయి. 7వేలకు పైగా జనం ప్రాణాలు వదిలారు.