Kaveri River: 94 సంవత్సరాల తర్వాత కావేరి నది పొంగి ప్రవహిస్తోంది. ఈ అద్భుతమైన డ్రోన్ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కావేరి నది దక్షిణ భారతదేశంలో ప్రవహించే ముఖ్యమైన నది. ఇది కర్ణాటక రాష్ట్రంలోని కొడగు జిల్లాలో పశ్చిమ కనుమలలోని బ్రహ్మగిరి కొండలలో పుట్టింది. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది. ఈ నదిని ప్రజలు పవిత్రంగా భావిస్తారు.