
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాణిక్కం ఠాగూర్ కు రూ. 50 కోట్లు ఇచ్చి రేవంత్ పదవి పొందారని ఆరోపించారు. మాణిక్కం ఠాగూర్ ఓ యూజ్ లెస్ ఫెలో అంటూ తీవ్రస్థాయిలో వ్యాఖ్యాించాడు. రేవంత్ రెడ్డి కంటే ఉత్తమ్ రెడ్డి లక్ష రెట్లు నయమని కౌశిక్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న నియోజకవర్గంలో వదిలిపెట్టి ఫొటోలు దిగుతున్నారు. సినిమా యాక్టర్ లా రేవంత్ రెడ్డి ఫీల్ అవుతున్నారు. టీపీసీసీ చీఫ్ పదవి వస్తే ముఖ్యమంత్రి అయినట్లు భావిస్తున్నారని అన్నారు. సినిమాలో ముమైత్ ఖాన్ వస్తే చప్పట్లు, ఈలలు కొడతారు. కాంగ్రెస్ పార్టీకి దిక్కు లేదు. సీఎం సీఎం అంటే సరిపోతుందా అంటూ కౌశిక్ రెడ్డి మండిపడ్డారు.