
మహారాష్ట్రంలోని శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం మమారాష్ట్ర వికాస్ అఘాదీ ఐదేండ్లు పూర్తి చేసుకుంటుందని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ తెలిపారు. ముఖ్యమంత్రి ఉద్ధవ్, ప్రధాని మోదీ భేటీ నేపథ్యంలో తమ ప్రభుత్వ స్థిరత్వంపై వస్తున్న అనుమానాలను తోసిపుచ్చారు. శివసేన నమ్మదగిన పార్టీ అని పవార్ అన్నారు. ఎన్సీపీ 22వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తలనుద్దేశించి ఆయన మాట్లాడారు. సీఎం ఉద్ధవ్, ప్రధాని మోదీ భేటీతో తమ ప్రభుత్వానికి వచ్చే నష్టమేమీ లేదని పవార్ తేల్చి చెప్పారు. ఐదు సంవత్సరాలు పూర్తిగా పరిపాలిస్తామని ధీమా వ్యక్తం చేశారు.