
కరోనా వైరస్ దేశంలో విజృంభిస్తోంది. దేశంలో 90 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. అంతే స్థాయిలో ప్రముఖులకు ఈ వైరస్ విస్తరిస్తోంది. తాజాగా కర్ణాటక ఉప ముఖ్యమంత్రికి పరీక్షలకు చేయగా పాజిటివ్ అని తేలింది. డిప్యూటీ సీఎం గోవింద్ ఎం కర్జోల్ అనారోగ్యానికి గురి కావడంతో ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. దీంతో పాజిటివ్ అని తేలింది. అయితే ఆయనకు ఎలాంటి లక్షణాలు లేవని, వైద్యుల సలహా మేరకు ఆసుపత్రిలో ఉంటారని సన్నిహితులు తెలిపారు. ఇటీవల అతనిని కలిసిన వారు కరోనా టెస్టులు చేయించుకోవాలని తెలిపారు.
Also Read: ఇష్టమొచ్చినట్లు యాప్స్ డౌన్లోడ్ చెయ్యొద్దు : కేంద్రం
Comments are closed.