
కమల్ హాసన్ స్థాపించిన మక్కల్ నీది మయ్యమ్ పార్టీలో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే పార్టీ ఉపాధ్యాక్షడు సహా కొందరు ప్రముఖులు రాజీనామా చేయగా తాజాగా మరో కీలక నేత గురువారం రాజీనామా చేశారు. సీకే కుమారవేల్, కమల్ పార్టీ స్థాపించినప్పటి నుంచి కీలకంగా వ్యవహరించారు. కాగా ఎన్నికల్లో ఓటమిని అంగీకరిస్తూ పార్టీకి రాజీనామా చేశారు. అయితే ఎన్నికలకు సంబంధించి పార్టీకి సీకే కుమారవేల్ సరైన సూచనలు ఇవ్వలేదనే విమర్శ ఉంది. మే 2న అసెంబ్లీ ఫలితాలు వెలువడిన నాటి నుంచి పార్టీలో రాజీనామాల పర్వం కొనసాగుతోంది.