‘ఎమర్జెన్సీ ఫుడ్’ ఈ పదం ఏదొక సందర్భంలో ప్రతి ఒక్కరి జీవితంలో తారసపడే కఠిన పరిస్థితులకు చక్కని పరిష్కారం ఇవ్వగలదు. అసలుకే వైరస్ కాలం ఇది, భవిష్యత్తులో ఇక ఎలాంటి పరిస్థితులు వస్తాయో తెలియదు, మరోపక్క వరదలు యుద్ధాలు లాంటి సునామీలో మనం చిక్కుకుపోవచ్చు. అలాంటప్పుడు మనల్ని బతికించేదే ఈ ‘ఎమర్జెన్సీ ఫుడ్’నే. ‘మోడ్రన్ ఋషి’ పూరి జగన్నాథ్ ‘పూరీ మ్యూజింగ్స్’ అంటూ
మనకు తెలియని ఎన్నో విషయాలను తెలియజేసే క్రమంలో ఈ కొత్త టాపిక్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ టాపిక్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుండటం విశేషం. మరి పూరి మాటల్లోనే ”వరదలు రావొచ్చు.. యుద్ధాలు రావొచ్చు.. సునామీలో చిక్కుకుపోవచ్చు.. లేదా ప్రస్తుతం మనం చూస్తున్న ఇలాంటి విపత్తు లాంటిది ఏదో ఒకటి వచ్చి లాంగ్ లాక్ డౌన్ కూడా పెట్టొచ్చు.
అలాగే ఏదో దరిద్రం జరిగి ఒక నెల పాటు కరెంట్ కూడా పోవచ్చు, మనం అసలు బయటకు వెళ్లలేని విధంగా బయట సమాజంలో ఏదొక ఆంక్షలు కూడా రావొచ్చు. మరి అలాంటి సమయంలో మనం సర్వే కావడం కోసం కనిపెట్టిందే ఎమర్జెన్సీ ఫుడ్. ఒక బకెట్ లో ఫుడ్ ప్యాకెట్స్ ఉంటాయి. కేవలం ఒక కప్పు హాట్ వాటర్ లో కలిపి ఆ ఫుడ్ ను మనం ఈజీగా తీసుకోవచ్చు. బ్రేక్‌ఫాస్ట్, లంఛ్, డిన్నర్ చొప్పున ఒక నెలకు సరిపడా ఫుడ్ బకెట్స్ మనకు మార్కెట్ లో దొరుకుతున్నాయి.
రెండు రోజులకు సరిపడే ఫుడ్ ప్యాకెట్స్ కూడా మనకు బయట దొరుకుతున్నాయి. అలాంటి ఫుడ్ బకెట్ ఒకటి తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటే, అది పాతికేళ్ల వరకూ సేఫ్ గా ఉంటుంది. ఆ బకెట్ లో సూప్స్, చికెన్ నూడిల్స్, పాస్తా.. ఇలా చాల రకాల ఐటమ్స్ ఉంటాయి. ఈ ఎమర్జెన్సీ ఫుడ్ ను అందించడానికి మనకు చాలా కంపెనీలు ఉన్నాయి. దీన్ని ఎక్కువగా మిలిటరీ వాళ్ళు వాడతారు. నేను ఓ బకెట్ తెచ్చి పెట్టాను. వీలైతే మీరు కూడా ఓ బకెట్ తెచ్చి పెట్టుకోండి. ప్రపంచం నాశనం అయినా మనం వేడి వేడి పాస్తా, చికెన్ రైస్ తినొచ్చు’ అంటూ పూరి చెప్పుకొచ్చాడు.