Kamal Haasan: కన్నడ భాషపై కమల్ హాసన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై కర్ణాటకలో అధికార, విపక్ష పార్టీలు భగ్గుమంటున్నాయి. దీంతో ఆయన చిత్రం థగ్ లైఫ్ కర్ణాటకలో విడుదల వ్యవహారం ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో కమల్ హాసన్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. తన చిత్రం థగ్ లైఫ్ ను కర్ణాటకలో విడుదల చేసి ప్రదర్శించేందుకు వీలుగా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఈ పిటిషన్ ను తన నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిల్మ్ ఇంటర్నేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ద్వారా హైకోర్టులో దాఖలు చేశారు.