Kalyan Ram financial status : తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఈ ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలందరు టాప్ హీరోలుగా మారడమే కాకుండా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో వాళ్ళ మార్కును కూడా చూపిస్తున్నారు. ‘విశ్వ విఖ్యాత నట సార్వభౌమ శ్రీ నందమూరి తారకరామారావు’ దగ్గర నుంచి ‘జూనియర్ ఎన్టీఆర్ ‘ వరకు ప్రతి ఒక్కరు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎలివేట్ చేసుకున్న వాళ్లే కావడం విశేషం. ఇక ఇలాంటి క్రమంలోనే బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ లాంటి హీరోలు ఇప్పుడు టాప్ హీరోలుగా ముందుకు సాగుతున్నారు.
ఇక వీళ్లతో పాటుగా కళ్యాణ్ రామ్ సైతం అడపదడప సినిమాలను చేస్తూ హీరోగా తనను తాను ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. వెంకటేష్ – కళ్యాణ్ రామ్ ఇద్దరు కలిసి ఈ సినిమాలో నడుస్తుండడం విశేషం… ఇక గతంలో కళ్యాణ్ రామ్ చాలా వరకు సినిమాలను ప్రొడ్యూస్ చేసి భారీగా నష్టాన్ని చవిచూశాడు. అయితే ఎన్టీఆర్ తో జై లవకుశ, దేవర లాంటి సినిమాలను ప్రొడ్యూస్ చేసి కొత్త వరకు లాభాలను ఆర్జించాడు.
అయినప్పటికి ఆయన ఇంకా అప్పుల్లోనే ఉన్నాడనే వార్తలైతే వస్తున్నాయి. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ తో చేస్తున్న ‘డ్రాగన్’ సినిమాలో కూడా వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ గా కళ్యాణ్ రామ్ వ్యవహరిస్తున్నాడు. ఇక ఈ సినిమాలతో పాటుగా ఆయన ప్రస్తుతం అనిల్ రావిపూడి డైరెక్షన్ లో చేస్తున్న సినిమాతో సక్సెస్ ని సాధించి మరోసారి లైమ్ లైట్ లోకి రావాలనే ప్రయత్నంలో ఉన్నాడు. తను అనుకున్నది వర్కౌట్ అయితే మాత్రం కళ్యాణ్ రామ్ మరోసారి తనను తాను స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకున్నవాడవుతాడు.
లేకపోతే మాత్రం ఆయన మరోసారి డీలా పడిపోయే ప్రమాదం ఉంది. ఇక కళ్యాణ్ రామ్ ఈ సినిమాతో సక్సెస్ సాధిస్తే ఇంకొంతమంది ప్రొడ్యూసర్స్ నుంచి అతనికే అడ్వాన్సులు వచ్చే అవకాశాలైతే ఉన్నాయి. ఇక వాటితో ఆయన కొంతవరకు అప్పులను కూడా తీర్చుకునే అవకాశం ఉందని మరి కొంతమంది భావిస్తున్నారు…
