
కడప జిల్లాలోని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి మఠం పీఠాధిపతి వివాదంపై హైకోర్టులో విచారణ జరిగింది. మఠానికి శాశ్వత, తాత్కాలిక మఠాధిపతులు గా తమను గుర్తించేలా దేవాదాయశాఖను ఆదేశించాలని కోరుతూ దివంగత మఠాధిపతి రెండో భార్య మారుతి మమాలక్ష్మి, ఆమె కుమారుడు ఎన్. గోవిందస్వామి దాఖలు చేసిన పిటిషన్ పై ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. మథాధిపతి విషయంలో దేవాదాయశాఖ జోక్యం చేసుకుందని, తమను బలవంతంగా ఒప్పించారని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇరు వైపుల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ చేసింది. ఈనెల 16న తీర్పును వెల్లడిస్తామని తెలిపింది.