Jetly vs Gayapadda Simham : సినిమా ఇండస్ట్రీలో ఒకే వారంలో రిలీజ్ అయిన సినిమాల మధ్య విపరీతమైన పోటీ ఉంటుంది. అందులో ఒక సినిమా సక్సెస్ ని సాధిస్తే మరో సినిమా డైలమాలో పడిపోతుంది. లేదంటే రెండు సినిమాలు సక్సెస్ లను సాధించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక ఇలాంటి క్రమంలోనే రీసెంట్ గా రిలీజ్ అయిన జెట్లీ, గాయపడ్డ సింహం సినిమాల పరిస్థితి ఏంటి ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా విజయాన్ని సాధించింది అనే విషయాన్ని తెలుసుకోవడానికి సోషల్ మీడియాలో కొంతమంది కొన్ని వార్తలను వైరల్ చేస్తున్నారు. నిజానికి సత్య హీరోగా మారి చేసిన ‘జెట్లీ’ సినిమా చాలా నవ్వులు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంది.
అలాగే దర్శకుడి మేకింగ్ కూడా చాలా బాగుంది. ఈ సినిమా చూసిన కొంతమంది మూవీ మీద ప్రశంసల వర్షాన్ని కురిపిస్తున్నారు. ఇక తరుణ్ భాస్కర్ హీరోగా చేసిన ‘గాయపడ్డ సింహం’ సినిమా సైతం ప్రేక్షకులను ఒక మోస్తరుగా అలరిస్తుంది. మొత్తానికైతే ఈ సినిమాతో తరుణ్ భాస్కర్ ఒక సక్సెస్ ని సాధించాడు అంటూ చాలామంది సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.
నిజానికి జెట్లీ వర్సెస్ గాయపడ్డ సింహం ఈ రెండింటిలో ఏ సినిమా విజయాన్ని సాధించింది అనే విషయం చెప్పడం కష్టమే…ఎందుకంటే రెండు సినిమాలు కూడా యావరేజ్ టాక్ ను సంపాదించుకున్నాయి. తద్వారా లాంగ్ రన్ లో ఏ సినిమాలు ఎలాంటి కలెకన్స్ ను రాబడతాయి. దాని ద్వారా కలెక్షన్స్ ను బేస్ చేసుకొని ఏ సినిమా సూపర్ సక్సెస్ ని సాధించింది. ఏ సినిమా డీలా పడిపోయింది అనే విషయాలను క్లారిటీగా చెప్పొచ్చు. కానీ రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమాల విషయంలో ఏది బ్లాక్ బస్టర్ అయింది అనేది చెప్పడం చాలా కష్టం…
ఇక రెండు సినిమాలు కూడా సక్సెస్ ఫుల్ గానే రన్ అవుతున్నాయి. కాబట్టి ఈ రోజు గడిస్తే సోమవారం రోజు ఈ సినిమాల కలెక్షన్స్ ఏ రేంజ్ లో ఉంటాయి. పెరుగుతాయా? తగ్గుతాయా? అనే దాన్ని బేస్ చేసుకొని సినిమాలు సక్సెస్ సాధించాయా లేదంటే ఫెయిల్యూరా మారాయా అనేది తెలుస్తుంది…