Drishyam 3 Movie Review: ఇండియన్ సినిమా ఇండస్ట్రీ హిస్టరీ లో , థియేటర్స్ లో ఆడియన్స్ కి అబ్దుతమైన థ్రిల్లింగ్ అనుభూతి ని కలిగించిన చిత్రం ‘దృశ్యం’. ఈ చిత్రం మలయాళం లో ఇండస్ట్రీ హిట్ అవ్వడం తో కొన్నాళ్ళకు అన్ని భాషల్లోనూ రీమేక్ చేశారు. తెలుగు లో వెంకటేష్ , హిందీ లో అజయ్ దేవగన్, తమిళం లో కమల్ హాసన్ వంటి వారు చేశారు, రెస్పాన్స్ అదిరిపోయింది. సీక్వెల్ మలయాళం , తెలుగు వెర్షన్స్ ని వెంకటేష్ , మోహన్ లాల్ చేసి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ ని సొంతం చేసుకున్నారు కానీ , ఈ రెండు సినిమాలు ఓటీటీ లో నేరుగా విడుదలయ్యాయి, కానీ హిందీ లో మాత్రం థియేటర్స్ లో విడుదలై పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చింది. ఇప్పుడు ఈ సిరీస్ లో భాగంగా తెరకెక్కిన ‘దృశ్యం 3’ నేడు ప్రపంచవ్యాప్తంగా హిందీ మినహియించి అన్ని ప్రాంతీయ భాషల్లో విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉందో ఒకసారి ఈ రివ్యూ లో చూసి తెలుసుకుందాం.
కథ :
‘దృశ్యం 2’ లో కథ ఎక్కడైతే ముగిసింది , ‘దృశ్యం 3’ ని అక్కడి నుండే మొదలు పెట్టారు. వరుణ్ హత్య సుసులో జార్జ్ కి ఎలాంటి సంబంధం లేదని తేల్చిన హై కోర్టు , అతనిపై నమోదు చేయబడిన కేసు ని కొట్టిపారేస్తుంది. ఇక అప్పటి నుండి జార్జ్ తన కుటుంబం తో కలిసి కొత్త జీవితాన్ని మొదలు పెడుతాడు. కొన్నాళ్ళకు ఆయన సినీ నిర్మాతగా మారి , తన జీవితం లో జరిగిన సంఘటనలను ఆధారంగా తీసుకొని ‘దృశ్యం’ అనే సినిమా తీసి భారీ హిట్ ని అందుకుంటాడు. మరో వైపు తన పెద్ద కూతురు కి పెళ్లి చెయ్యాలని సంబంధాలను చూస్తూ ఉంటాడు జార్జ్. కానీ ఒక్క సంబంధం కూడా కుదరదు, చివరి నిమిషం వరకు వచ్చి ఆగిపోతుంటాయి. అప్పుడు జార్జ్ కి అనుమానం వచ్చి ఆరా తీయగా, కొందరు శత్రువులు తన కూతురు పెళ్లి జరగనివ్వకుండా అడ్డు పడుతున్నారని తెలుస్తుంది.
అంతే కాదు , వరుణ్ హత్య కేసులో తన కుమార్తెను జైలు పాలు చెయ్యాలని కూడా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇంతకీ జార్జ్ కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నది ఎవరు? , జార్జ్ ని ఎలా అయినా దెబ్బ కొట్టి అరెస్ట్ చెయ్యాలని చూస్తున్న పోలీసులు ఈ కుట్రని ఎలా వాడుకున్నారు?, ఈసారి తన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం జార్జ్ ఏమి చేశాడు అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ:
మన తెలుగు దృశ్యం , దృశ్యం 2 చిత్రాల్లో నటించిన నటీనటులు వేరు, మలయాళం లో నటించిన నటీనటులు వేరు, మీనా మినహా, మిగిలిన వాళ్లంతా మనకు కొత్త ముఖాలు, ఈ కారణం చేత , మొదటి రెండు భాగాలకు సంబంధించిన నటీనటుల కొనసాగింపు ని గుర్తు పట్టడం ఆడియన్స్ కి చాలా కష్టం అవుతుంది. ఈ కారణం చేత పాత్ర తీరు తెన్నెలు అర్థం చేసుకోవడం, దాని అనుసంధానంగా వచ్చే ట్విస్టులు అర్థం చేసుకోవడం చాలా కష్టమైన పని. టైటిల్ పడే ముందే డైరెక్టర్ మొదటి రెండు భాగాలకు సంబంధించిన స్టోరీ ని ఒక గ్లింప్స్ లాగా చూపించి , మూడవ భాగం లోకి తీసుకొస్తాడు. అయితే ఫస్ట్ హాఫ్ మొత్తం స్క్రీన్ ప్లే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా అనిపిస్తుంది , కథ ముందుకు సాగుతుంది అనే ఫీలింగ్ ఎవరికీ కలగదు. తన కూతురు పెళ్లి సంబంధాలను చెడగొట్టే సన్నివేశాలు రిపీట్ లో చూసాం అనే ఫీలింగ్ కలుగుతుంది ఆడియన్స్ కి. ఎప్పుడైతే మోహన్ లాల్ శత్రువులను గురిస్తాడో , అప్పటి నుండి సినిమా వేగం అందుకుంటుంది. అయితే మొదటి రెండు భాగాల్లో వచ్చే ట్విస్టులు ఇందులో పెద్దగా లేవు , కేవలం క్లైమాక్స్ ఒక్కటే థ్రిల్లింగ్ కి గురి చేస్తుంది.
చివరిమాట : భారీ అంచనాలు పెట్టుకొని థియేటర్స్ కి వెళ్తే మాత్రం నిరాశ చెందక తప్పదు.
