Jerusalem Muthaiah on CM Revanth: రెండు తెలుగు రాష్ట్రాలలో అప్పట్లో ఓటుకు నోటు కేసు సంచలనం సృష్టించింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అప్పటి టిడిపి నాయకుడు రేవంత్ రెడ్డి డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఆ తర్వాత ఆయనను జైలుకు కూడా పంపించారు. జైలు నుంచి విడుదలైన తర్వాత రేవంత్ ఏకంగా కేసీఆర్ కు సవాల్ విసిరారు. రాజకీయంగా తన దిశను పూర్తిగా మార్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరి.. ఏకంగా ముఖ్యమంత్రి అయిపోయారు. రేవంత్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఓటుకు నోటు కేసు కోల్డ్ స్టోరేజ్ లోకి వెళ్తుందని అందరు అనుకున్నారు.
అటువంటి పరిణామాలు కాకుండా.. ఊహించని విధంగా తెలంగాణలో అనేక రకాలైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఓటుకు నోటు కేసులో a4 గా ఉన్న జెరూసలేం ముత్తయ్య విలేకరుల ముందుకు వచ్చాడు. హైదరాబాదులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంచలన విషయాలను వెల్లడించాడు..” నాడు నేను సరెండర్ అయితే రేవంత్ రెడ్డి ఏసీబీ ఆఫీసులో ఆత్మహత్య చేసుకుంటానని ఆయన భార్యతో నాకు ఫోన్ చేయించాడు. వాస్తవానికి నేను ఓటుకు నోటు కేసులో సరైన అవ్వాలని భావించాను. రేవంత్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు. ఒకవేళ నేను గనుక సరెండర్ అయితే రేవంత్ రెడ్డిని టిడిపి నుంచి సస్పెండ్ చేస్తారు. అప్పుడు ఆయన రాజకీయ జీవితం పూర్తిగా సమాధి అవుతుంది. అందువల్ల రేవంత్ ఏసీబీ ఆఫీసులో ఆత్మహత్య చేసుకుంటానని అన్నాడని నాతో ఆయన భార్య గీతారెడ్డి ఫోన్లో చెప్పారు. రేవంత్ రెడ్డి ఆత్మహత్య చేసుకుంటానని చెప్పడంతో.. ఒక ప్రాణం ఎందుకు తీయాలని నేను అనుకున్నాను. అందువల్లే సరెండర్ కాలేదు” అని ముత్తయ్య సంచలన వ్యాఖ్యలు చేశాడు.
ముత్తయ్య చేసిన వ్యాఖ్యలు గులాబీ పార్టీ కోరుకున్న విధంగా ఉండడంతో.. కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రంగా స్పందిస్తున్నారు. “నాడు గులాబీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఈ కేసు విషయంలో ఏం చేయలేకపోయింది. ఇప్పుడు ఏం చేయగలుగుతుంది.. ప్రభుత్వాన్ని కూలగొట్టే విధంగా రేవంత్ చేశారని నాడు విష ప్రచారాన్ని మొదలుపెట్టింది. ప్రజలలో సింపతి పెంచుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేసింది. చివరికి తెలంగాణ ప్రజలు విజ్ఞత ప్రదర్శించారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. ఓటుకు నోటు కేసు కక్షతో పెట్టింది. రేవంత్ రాజకీయ జీవితాన్ని సమాధి చేయడానికి చేసిన కుట్ర. ఆ కుట్ర నుంచి రేవంత్ బయటపడ్డారు. ముత్తయ్య లాంటివారు ఎలాంటి మాటలు మాట్లాడిన పెద్దగా ఉపయోగం ఉండదు. మహా అయితే గులాబీ పార్టీ కుల సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవడానికి పనికి వస్తుందని” కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.
నేను సరెండర్ అయితే రేవంత్ రెడ్డి ఏసీబీ ఆఫీసులో ఆత్మహత్య చేసుకుంటా అని ఆయన భార్యతో నాకు ఫోన్ చేయించాడు
నేను ఓటుకు నోటు కేసులో సరెండర్ అవ్వాలని అనుకున్నాను
రేవంత్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు.. నేను సరెండర్ అయితే రేవంత్ రెడ్డిని టీడీపీ పార్టీలో నుండి సస్పెండ్ చేస్తారు
అప్పుడు తన… https://t.co/dVprOrc9IH pic.twitter.com/bfQIFvM0AP
— Telugu Scribe (@TeluguScribe) September 25, 2025