India squad for WI test 2025: ఇటీవల ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన టెస్ట్ సిరీస్ లో టీమిండియా ఊహించని ప్రదర్శన చేసింది. ట్రోఫీ అందుకోలేకపోయినప్పటికీ.. ఆతిథ్య జట్టు కు ట్రోఫీ దక్కకుండా అడ్డుకుంది. అంతేకాదు సుదీర్ఘ ఫార్మాట్లో స్ఫూర్తిదాయకమైన ప్రదర్శన చేసి ఆకట్టుకుంది. యువ ఆటగాళ్లతో కూడిన భారత బృందం అదరగొట్టింది. యువ నాయకుడు గిల్ సెంచరీల మోత మోగించాడు. ఈ నేపథ్యంలో భారత జట్టును గిల్ నాయకత్వంలో నడిపించాలని మేనేజ్మెంట్ భావించింది. దానికి తగ్గట్టుగానే స్వదేశంలో జరిగే టెస్ట్ సిరీస్ కు భారత జట్టును మేనేజ్మెంట్ ప్రకటించింది.. కెప్టెన్ విషయంలో ఎటువంటి మార్పులు చేపట్టలేదు.. గిల్ కు సారధ్య బాధ్యతలు అప్పగించింది.
గిల్ తో పాటు అనేక యువకులకు మేనేజ్మెంట్ అవకాశం కల్పించింది. అక్టోబర్ 2 నుంచి 6 మధ్య వెస్టిండీస్ జట్టుతో భారత్ వేదికగా తొలి టెస్ట్ నడుస్తుంది. పది నుంచి 14 తేదీల మధ్య 2వ టెస్ట్ జరగనుంది. ఈ టెస్ట్ సిరీస్ కోసం టీం ఇండియా మేనేజ్మెంట్ జట్టును ప్రకటించింది. గిల్ కు సారధ్య బాధ్యతలు అప్పగించింది. రవీంద్ర జడేజా కు ప్రమోషన్ ఇచ్చి.. వైస్ కెప్టెన్ ను చేసింది. కే ఎల్ రాహుల్, సాయి సుదర్శన్, దేవదత్ పడికల్, జురెల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, బుమ్రా, నితీష్ కుమార్, జగదీశన్, సిరాజ్, ప్రసిద్ధి కృష్ణ, కులదీప్ యాదవ్ వంటి వారితో జట్టును మేనేజ్మెంట్ ప్రకటించింది.
వాస్తవానికి వెస్టిండీస్ జట్టుతో జరిగే టెస్ట్ సిరీస్ లో శ్రేయస్ అయ్యర్ కు అవకాశం కల్పిస్తారని ప్రచారం జరిగింది. అయితే ఈ సిరీస్ లో కూడా అతడికి మేనేజ్మెంట్ మొండి చేయి చూపించింది. అతడికి కాకుండా మిగతా ఆటగాళ్లకు అవకాశం కల్పించింది. అయితే అతడి అభిమానులు సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తారని భావించి ఆస్ట్రేలియా ఏ జట్టుతో జరిగే మూడు వన్డేల అనధికారిక సిరీస్ కు అయ్యర్ కు సారధ్య బాధ్యతలు అప్పగించింది.. ఇటీవల ఇంగ్లాండ్ సిరీస్.. ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్ లో కూడా అయ్యర్ కు జట్టులో చోటు దక్కకపోవడం విశేషం.
Presenting #TeamIndia‘s squad for the West Indies Test series #INDvWI | @IDFCFIRSTBank pic.twitter.com/S4D5mDGJNN
— BCCI (@BCCI) September 25, 2025