Jailer 2 scenes leaked : రీసెంట్ గానే కోలీవుడ్ లో హీరో విజయ్(Thalapathy Vijay) నటించిన ‘జన నాయగన్'(Jana Nayagan Movie) చిత్రం ఎడిటింగ్ నుండి లీక్ అవ్వడం ఎంతటి దుమారం రేపిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సోషల్ మీడియా లో ఎక్కడ చూసినా ee సినిమాకు సంబంధించిన సన్నివేశాలే చక్కర్లు కొట్టాయి. తమిళనాడు లోని కొన్ని ప్రాంతాల్లో ఈ సినిమా లోకల్ చానెల్స్ లో కూడా టెలికాస్ట్ అయ్యింది. ఆన్లైన్ లో ఈ చిత్రం లీకై ఇన్ని రోజులు అవుతున్నప్పటికీ కూడా, ఇప్పటి వరకు థియేటర్స్ లో ఈ చిత్రం విడుదల కాకపోవడం గమనార్హం. అందుకు ముఖ్య కారణం సెన్సార్ సర్టిఫికేట్ రాకపోవడమే. ఈ సినిమా సంగతి కాసేపు పక్కన పెడితే, కోలీవుడ్ లో విపరీతమైన అంచనాలను ఏర్పాటు చేసుకున్న ‘జైలర్ 2′(Jailer 2 Movie) చిత్రం లోని కొన్ని సన్నివేశాలు ఇప్పుడు సోషల్ మీడియా లో లీక్ అయ్యాయి అంటూ వస్తున్న వార్తలు అభిమానులను కలవరపెడుతున్నాయి.
అయితే మూవీ టీం వెంటనే అలెర్ట్ అవ్వడం , ఆ సన్నివేశాలు ఆడియన్స్ వరకు చేరే ముందే తొలగించడం వంటివి చేయడం తో , ఎవరికీ రీచ్ అవ్వలేదు. అయితే కోలీవుడ్ లో ఎవరు ఇలా వరుసగా సినిమాలను లీక్ చేస్తున్నారు?, ఎదో పెద్ద మాఫియా నే ఉన్నట్టు ఉందే అంటూ సోషల్ మీడియా లో దీనిపై పెద్ద చర్చ సాగుతోంది. ‘జైలర్ 2’ చిత్రానికి వెయ్యి కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టేంత సత్తా ఉంది. ‘జైలర్’ కి వచ్చిన రేంజ్ లో పాజిటివ్ టాక్ వస్తే , ఇంకా ఎక్కువ గ్రాస్ వసూళ్లను కూడా రాబట్టొచ్చు , అలాంటి సినిమాకు సంబంధించిన సన్నివేశాలు లీక్ అయ్యిందంటే, రేపు సినిమా మొత్తం విడుదలకు ముందే లీక్ అవ్వదు అని గ్యారంటీ ఏంటి?, అందుకే మేకర్స్ ఇప్పుడు కంటెంట్ విషయం లో చాలా జాగ్రత్తలు తీసుకున్నట్టు తెలుస్తోంది.
సరికొత్త టెక్నాలజీ తో సెక్యూరిటీ సిస్టమ్స్ ని ఏర్పాటు చేస్తున్నారు. మరి ఎంత వరకు లీక్ అవ్వకుండా కాపాడుతారో చూడాలి. 2023 వ సంవత్సరం లో విడుదలైన ‘జైలర్’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 600 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించింది. మన తెలుగు వెర్షన్ నుండి కూడా ఈ చిత్రానికి దాదాపుగా 90 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. వరుస ఫ్లాప్స్ ని ఉన్న రజినీకాంత్(Superstar Rajinikanth) మార్కెట్ కి ఈ సినిమా చేసిన మేలు సాధారణమైనది కాదు. అలాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ కి సీక్వెల్ కావడం తో , ఈ సినిమా పై అన్ని భాషల్లోనూ విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఆగస్టు నెలలో ఈ చిత్రాన్ని విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.