
కరోనా కట్టడిలో జగన్ ప్రభుత్వం విఫలమైందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు ఆరోపించారు. వ్యాక్సిన్లు సేకరించాల్సిన బాధ్యత సీఎం జగన్ పై ఉంటే కేంద్రమే కొనాలని కోరుతూ ముఖ్యమంత్రులకు లేఖలు రాసి కేంద్రాన్ని విమర్శిస్తున్నారని అన్నారు. ఈ వైఖరిని ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. జగన్ ప్రభుత్వం కేంద్రం పంపిన మందులు, వెంటిలేటర్లు, వ్యాక్సిన్లు సరిగా వినియోగించలేదని ఆరోపించారు. కోవిడ్ నియంత్రణ పై రాష్ట్ర ప్రభుత్వం వద్ద సరైన ప్రణాళిక లేదని అందుకే ప్రజలు ప్రాణాలు కోల్పోయారన్నారు.