
అక్రమాస్తుల కేసులో నిందితులుగా ఉన్న ఏపీ సీఎం జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్లపై తీర్పు వాయిదా పడింది. జగన్, విజయసాయి బెయిల్ రద్దు చేయాలంటూ నర్సాపురం ఎంపీ రఘురామ దాఖలు చేసిన పిటిషన్లపై గత కొంతకాలంగా నాంపల్లిలోని సీబీఐ కోర్టు విచారణ జరుపుతోంది. ఈ కేసులో జగన్ బెయిల్ రద్దు పిటిషన్ పై ఇప్పటికే వాదనలు పూర్తికాగా .. విజయసాయి బెయిల్ రద్దు పిటిషన్ పై ఈరోజు వాదనలు ముగిశాయి. దీంతో ఈ రెండు పిటిషన్లపై ఒకే రోజు తీర్పు వెలువరిస్తామని సీబీఐ కోర్టు వెల్లడించింది. తీర్పు వెల్లడిని వచ్చే నెల 15కి వాయిదా వేసింది.