
రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో గోవా ప్రభుత్వం కట్టడి చర్యలకు దిగింది. కోవిడ్ చికిత్స ప్రోటోకాల్ ను విడుదల చేసింది. గోవాలో ని 18 ఏళ్ల వయసు దాటిన వారందరూ యాంటీ వైరల్ డ్రగ్ ఐవర్ మెక్టీస్ ను తీసుకోవాలని సూచించింది. ఈ విషయాన్ని గోవా ఆరోగ్య శాఖ మంత్రి విశ్వజీత్ రాణె ప్రకటించారు. కోవిడ్, ఇతర వైరల్ జ్వరాల నివారణలో భాగంగా 18 ఏళ్లు నిండిన వారందరికీ ఐవర్ మెక్టీన్ ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు.