
తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రేపటి నుంచి తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ విధిస్తున్నట్టు ప్రకటించారు. దాదాపు 10 రోజుల పాటు లాక్ డౌన్ విధించాలని నిర్ణయించారు. ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో సమావేశమైన కేబినెట్ ఈ మేరకు పలు నిర్ణయాలు తీసుకుంది.
రేపటి నుంచి మే 12 నుంచి 22వ తేదీ వరకు కార్యకలాపాలకు అవకాశమిచ్చారు. నిత్యావసరాలు, ఇతర వస్తువుల కొనుగోలుకు ఈ సమయంలో వెసులుబాటు కల్పించారు. ఆ తర్వాత దాదాపు అన్ని కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి. అత్యవసర సేవలను మాత్రమే అనుమతించనున్నారు.
ప్రతిరోజు 20 గంటల పాటు లాక్ డౌన్ తెలంగాణలో అమల్లో ఉంటుందని కేసీఆర్ తెలిపారు. లాక్ డౌన్ సమయంలో నిబంధనలు ఖచ్చితంగా అమలు అయ్యేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
ఇక కరోనా టీకా కొరత దృష్ట్యా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీల నుంచి టీకా కొనుగోలు కోసం తెలంగాణ సర్కార్ గ్లోబల్ టెండర్లు పిలవాలని నిర్ణయించింది. కరోనా విషయంలో హైకోర్టు ఆదేశాలు, ఆక్షేపణల దృష్ట్యా తెలంగాణ సర్కార్ ఈ మేరకు తెలంగాణలో లాక్ డౌన్ విధిస్తూ నిర్ణయించింది.